Beijing: గంటకు 450 కి.మీ .. చైనా కొత్త బుల్లెట్ ట్రైన్ స్పీడ్
చైనా మరో ఘనత సాధించింది. గంటకు అత్యధికంగా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ (Bullet train )ను ప్రవేశపెట్టింది. ఈ రైలును సీఆర్ 450గా వ్యవహరిస్తోంది. ఆదివారం నాడు ఈ ట్రైన్‌ను బీజింగ్ (Beijing ) లో పరీక్షించారు. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దీన్ని నడిపించారు. టెస్ట్ సమయంలో ఇది 452 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అత్యాధునిక టెక్నాలజీ, అత్యంత నాజుగ్గా ఉన్న డిజైన్, చూడగానే ఆకట్టుకునే రీతితో దీన్ని తీర్చిదిద్దారు. ఈ బుల్లెట్ ట్రైన్ అత్యధికంగా గంటకు 450 కి.మీ వేగాన్ని అందుకుంటుందని చైనా రైల్వే శాఖ (China Railway Department) తెలిపింది. ఇది వినియోగంలోకి వచ్చిన తరవాత ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుంది. ఈ బుల్లెట్ రైలు బీజింగ్ నుంచి షాంఘై (Shanghai) మధ్య కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణించగలదు. ఈ రెండు నగరాల మధ్య దూరం 1050 కి.మీటర్లు.






