Assad: సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ పై రష్యాలో విష ప్రయోగం?
రష్యాలో ఆశ్రయం పొందుతున్న సిరియా (Syria )మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al –Asad) పై విష ప్రయోగం జరిగినట్లు తెలిసింది. ఆయన తీవ్ర దగ్గుతోపాటు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు సమాచారం. డిసెంబర్ 29న అసద్ అనారోగ్యం బారిన పడినట్టు సమాచారం. తొలుత ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటనే చికిత్స అందించినట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల్లో విషపదార్థాల ఆనవాళ్లు కనిపించాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. దీనిపై దర్యాప్తు సాగుతోందని రష్యా(Russia) నిఘా విభాగ మాజీ అధికారి తెలిపారు. అయితే దీనిపై రష్యా అధికారుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.






