America: ప్రాథమిక స్వేచ్ఛను గౌరవించాలి : అమెరికా పిలుపు
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో మత, మౌలిక మానవ హక్కులతో సహా ప్రాథమిక స్వాతంత్య్రాలను గౌరవించాలని అమెరికా పిలుపు ఇచ్చింది. బంగ్లాదేశ్(Bangladesh) లో మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల భారత్ (India) ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. మాతో సంబంధం ఉన్న ప్రతి ప్రభుత్వంతో మేము ఒకే వైఖరి అనుసరిస్తుంటాం. ప్రాథమిక స్వేచ్ఛలను గౌరవించవలసిన అవసరం ఉందని మేము సుస్పష్టం చేస్తున్నాం అని అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ (Vedant Patel) తెలిపారు.






