Elon musk: జర్మనీ ఎన్నికల ముందు కాకరేపిన మస్క్
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక (Donald Trump) మద్దతుదారు ఎలాన్ మస్క్ దృష్టి జర్మనీ (german )పై పడిరది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జర్మన్ పార్లమెంట్ ఎన్నికలు (Parliamentary elections) జరుగుతుండటంతో, ఈసారి అధికార మార్పిడి జరగాలని మస్క్ చెప్పారు. ఈ దేశానికి చిట్టచివరి ఆకాకిరణం ది ఆల్టర్నేటివ్ జర్మనీ పార్టీ అని తెలిపారు. ఈ ఫార్ రైట్ వింగ్ పార్టీ దేశాన్ని తీర్చిదిద్దగలదన్నారు. ఆర్థిక సౌభాగ్యం, సాంస్కవృతిక సమగ్రత, టెక్నలాజికల్ ఇన్నోవేషన్ అనేవి కేవలం కోరికలుగా మాత్రమే కాకుండా వాస్తవ రూపందాల్చే విధంగా దేశాన్ని నడపగలదని తెలిపారు.






