Sunil yadav: ప్రతీకారం తీర్చుకున్నాం.. అమెరికాలో
అమెరికాలో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ సునీల్ యాదవ్ (Sunil yadav) హత్యకు గురయ్యాడు. భారత్‌లో పలు కేసుల్లో వాంటెడ్ జాబితాలో ఉన్న అతడిని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi Gang ) హతమార్చింది. కాలిఫోర్నియా(California) లోని స్టాక్టన్ ఏరియాలో ఉన్న సునీల్ ఇంట్లోకి దూసుకెళ్లి లారెన్స్ షూటర్లు సునీల్‌ను చంపివేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తమ పనేనంటూ ఈ గ్యాంగ్ ప్రకటించింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్స్టర్లు గోల్డీ బ్రార్(Goldie Brar), రోహిత్ గొడారా(Rohit Godara) ఈ హత్యకు పాల్పడ్డారు. వీరు అమెరికా కేంద్రంగా కార్యకలపాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై బ్రార్ స్పందించారు. సునీల్ పంజాబ్ పోలీసులతో కుమ్మక్కై తమ సోదరుడు అంకిత్ బాధు మరణానికి కారకుడయ్యాడని, అందుకే ప్రతీకారం తీర్చుకున్నామని వెల్లడిరచారు.






