China: చైనాలో అమెరికా రాయబారిగా మాజీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్
అమెరికా అధ్యక్ష బాధ్యతలను తాను చేపట్టిన వెంటనే చైనా, మెక్సికో, కెనడాలపై 25 శాతం మేర అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా వ్యతిరేకిగా ముద్రపడిన మాజీ సెనెటర్, మాజీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ ఆల్ఫ్రేడ్ పెర్డ్యూ (David Alfred Perdue) ను ఆ దేశానికి అమెరికా రాయబారిగా నియమించనున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. చైనా(China) తో అమెరికా బంధాని బలోపేతం చేయడానికి విలువైన నిపుణుడిని తీసుకొస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.






