America :అమెరికాకు పొంచి ఉన్న పెనుముప్పు.. ప్రమాదంలో 7 కోట్ల మంది ?
అమెరికాకు భారీ మంచు తుపాను ముప్పు (Snowstorm threat) పొంచి ఉంది. ఇది ఈ దశాబ్ధిలోనే అతి తీవ్రమైనదిగా నిలుస్తుందని వాతావరణశాఖ అంచనా. పదిహేనుకుపైగా రాష్ట్రాల(Fifteen states )పై దీని ప్రభావం ఉంటుందని వాటిలో నివసిస్తున్న సుమారు 7 కోట్ల మందికి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. మధ్య అమెరికాలో మొదలైన శీతల తుపాను తూర్పు దిశగా కదలనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పోలార్ వర్టెక్స్ (Polar Vortex )కారణంగా అత్యంత శీతల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, మిస్సౌరి నుంచి మధ్య అట్లాంటిక్ వరకు తుపాను విస్తరించనుందని తెలిపింది.
వాతావరణ హెచ్చరికలతో అమెరికాలోని రాష్ట్రాలు(States) అప్రమత్తమయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సస్, ఆర్కాన్సాస్ రాష్ట్రాలు ఎమర్జెన్సీ విధించాయి. మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రమాదకర చలి వాతావరణం ఉంటుందని, మిస్సౌరి, ఇల్లినోయీలలోనూ భారీ మంచు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.






