Jinping: రష్యా పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(jinping) రష్యా(russia) లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బీజింగ్‌లోని రష్యా రాయబారి ఇగోర్ మోర్గులోవ్ పేర్కొన్నారు. జిన్‌పింగ్ పర్యటనలో ప్రాధాన్యతాపరంగా రహస్యమేలీ లేదు. ఉక్రెయిన్‌పై రష్యా వైఖరిని బీజింగ్ అర్థం చేసుకుంది. అంతర్జాతీయ రంగాలలో రష్యా, చైనాలపై పశ్చిమదేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై ఇరుదేశాలు మరింత స్పందించాల్సిన అవసరం ఉంది అని ఇగోర్ తెలిపారు. అధ్యక్షుడు వచ్చే ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు తెలిపారు. అయితే కచ్చితమైన తేదీలను వెల్లడిరచలేదు. ఈ పర్యటనకు సంబంధించి చైనా (Chinese) విదేశాంగశాఖ ఏ ప్రకటన చేయలేదు.






