China : ఆ డ్యామ్ తో భారత్ పై ప్రతికూల ప్రభావమేమీ ఉండదు
టిబెట్‌లో బ్రహ్మపుత్ర నది (Brahmaputra River )పై భారీ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా(China) సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణంపై భారత్(India,), బంగ్లాదేశ్ (Bangladesh ) ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై తాజాగా డ్రాగన్ స్పందించింది. తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో అనేక శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని, భారత్, బంగ్లాదేశ్‌లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని తెలిపింది. భారత్‌లో నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించింది.






