CHINA: చైనాలో మరో కొత్త వైరస్..ప్రపంచానికి డేంజర్ బెల్స్
కోవిడ్ వైరస్(CoVid) సృష్టించిన భయోత్పాతం ఇంతవేగంగా ఎవ్వరూ మర్చిపోలేరు. కోట్లాదిమందిని బలితీసుకున్న ఆరక్కసి..ప్రభావం నుంచి ప్రభావం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.తమవారిని కోల్పోయిన కుటుంబాల్లో ఇంకా ఆబాధలు, చాయలు పోలేదు కూడా. అలాంటిది ఆ బాధ నుంచే తేరుకోక ముందే చైనా నుంచి మరో కొత్త వైరస్ ఉత్పన్నమైంది. అయితే ఆవిషయాన్ని డ్రాగన్ దేశం.. బయట పెట్టడం లేదు. కోవిడ్ తరహాలోనే దాన్ని గోప్యంగా ఉంచుతోంది. కానీ అక్కడి విషయాలపై సోషల్ మీడియాలో మాత్రం చాలా దారుణమైన వార్తలు వినిపిస్తున్నాయి.
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆసుపత్రులలో అడుగు పెట్టడానికి కూడా స్థలం లేకుండా పోయింది.అదే తరహాలో ఇప్పుడు కూడా మరోసారి చైనాలోని పలు ఆసుపత్రులలో చాలా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ తర్వాత చైనాలో మరోసారి మరణ భీభత్సం నెలకొంది. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత చైనాలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ పేరు HMPV. దీని ప్రభావంతో ఆసుపత్రుల్లో అంతులేని క్యూలు ఉన్నాయి.
మళ్లీ ఇప్పుడు చైనాలోప్రజలు మాస్కులతో దర్శనమిస్తున్నారు.ప్రస్తుతం చైనాలో నాలుగు వైరస్లు గాలి ద్వారా వ్యాపించినట్లు చెబుతున్నారు. ఇన్ఫ్లుఎంజా A HMPV అంటే మైకోప్లాస్మా న్యుమోనియా వైరస్. ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. HMPV నమూనా వైరస్ సరిగ్గా కరోనా మాదిరిగానే ఉంటుందని, ఇది గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది..
hMPV వైరస్ పిల్లలు, వృద్ధులకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులు ఉన్న వ్యక్తులు కూడా దీని బారిన పడవచ్చు. ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే శ్వాస ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలు దీని అధిక వ్యాప్తికి కారణమవుతున్నాయి.. ప్రస్తుతానికి వ్యాప్తిని నిరోధించడానికి పరిశుభ్రతను పాటించడం,. చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించడం, సాధ్యమైన చోట సామాజిక దూరాన్ని పాటించాలి. మీకు అనారోగ్యంగా అనిపిస్తే, ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ వైరస్‌పై WHO మౌనం
కరోనా ప్రపంచాన్ని విధ్వంసం చేసి లెక్కలేనన్ని మంది ప్రాణాలను తీసినప్పుడు, WHO చాలా కాలం తర్వాత దీనిని పెండామిక్గా ప్రకటించింది. ఈసారి కూడా చైనా నుంచి వచ్చిన కొత్త వైరస్‌పై WHO మౌనం వహించింది. కరోనా సమయంలో చైనా తన మరణాలను దాచిపెట్టింది. ఈసారి కూడా ఈ వైరస్ దాడిపై చైనా మౌనంగా ఉంది. కానీ చైనాలోని పలు ప్రాంతాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రుల నుంచి శ్మశాన వాటికల వరకు అలర్ట్ జారీ చేశారు. కాబట్టి ప్రపంచం మరోసారి ఇంకో మహమ్మారి బారిన పడబోతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.






