Solar Gate: టెక్ హార్స్ గా చైనా.. ప్రపంచాన్నే అబ్బురపరుస్తున్న డ్రాగన్ కంట్రీ..
China Solar Energy: టెక్నాలజీ రంగంలో చైానా దూసుకెళ్తోంది. ఇప్పటికే బుల్లెట్ ట్రైన్, త్రీ గోర్జెస్ డ్యామ్ సహా పలు అద్భుతాలు సాధించిన చైనా.. ఇప్పుడు మరో అద్భుతాన్ని కళ్లముందు సాక్షాత్కరింపచేస్తోంది. చైనా ఈ భారీ ప్రాజెక్టును శరవేగంగా కొనసాగిస్తోంది. ‘సోలార్ గ్రేట్‌వాల్’ను నిర్మిస్తోంది. ఇది సుమారు 400 కిలో మీటర్ల పొడవుతో.. ఐదు కిలో మీటర్ల వెడల్పుతో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 100 గిగావాట్ల విద్యుత్ ను ప్రొడ్యూస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుతో దేశ రాజధాని విద్యుత్ అవసరాలను తీర్చనుంది. ఇప్పటి వరకు 5.4 గిగావాట్ల విద్యుత్ ను ప్రొడ్యూస్ చేసే సోలార్ ప్యానల్స్ అమర్చినట్లు చైనా ప్రకటించింది.
ఇన్నర్ మంగోలియా(Mangolia)లోని కబుకీ ఎడారిలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నిర్మానుష్య ఎడారిని గతంలో సీ ఆప్ డెత్‌గా పిలిచుకునేవారు. దీనిపై తాజాగా నాసా ఎర్త్ అబ్జర్వేటరీ స్పందించింది. ‘ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల కారణంగా ఫొటో వాల్టిక్ సముద్రంగా ఈ ప్రాంతం మారిపోయింద’ని పేర్కొంది.
ఈ ఎడారిలో వేడి వాతావరణం, చదునైన భూమికి పారిశ్రామిక ప్రాంతాలు దగ్గరగా ఉండడంతో సోలార్ ప్రాజెక్టుకు అనువుగా ఉండబోతోంది. నాసా ల్యాండ్ శాట్ 8, 9 ఉపగ్రహాలు ఇక్కడి పరిస్థితిని చిత్రీకరించాయి. డిసెంబర్ 2017, డిసెంబర్ 2024 చిత్రాలను పోల్చి చూస్తే మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుందని అమెరికా తెలిపింది.
చైనా ఇక్కడ నిర్మించే పవర్ స్టేషన్ ను ‘పరిగెత్తే గుర్రం’ ఆకారంలో నిర్మించింది. దీన్ని జున్మా సోలార్ పవర్ స్టేషన్(junma solar) అని పిలుచుకుంటారు.ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్యానల్స్ ఇమేజ్‌గా కబుకీ ఎడారి(kabuki) రికార్డు సృష్టించింది. ప్రతీ సంవత్సరం 200 కోట్ల కిలోవాట్ పర్ అవర్ కరెంట్ ను ఈ పవర్ స్టేషన్ ఉత్పత్తి చేయగలదు. చైనాలోని 4 లక్షలు మంది ప్రజల అవసరాలను ఇది తీరుస్తుంది.
ప్రస్తుతం చైనా సోలార్ విద్యుత్ సంస్థలు 3,86,875 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది మొత్తం ప్రపంచంలోని సామర్థ్యంలో సగానికి సమానం. ఆ తర్వాత అమెరికా 79,364 మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది. ఈ సోలార్ పవర్ స్టేషన్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఆలోచింపచేస్తోంది. కాలుష్యం, చమురు భారం నుంచి రక్షించుకునేందుకు సోలార్ మంచి ఆయుధం అన్న విషయాన్ని ప్రపంచానికి మరోసారి చాటింది చైనా.






