కాల్పుల విరమణకు తూట్లు.. యూఏఈ, కువైట్‌పై ఇరాన్ దాడులు!
పశ్చిమాసియాలో (Middle East) శాంతి నెలకొంటుందనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం (సీజ్ఫైర్) అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే చెత్తబుట్టపాలైంది. ఇరాన్‌లోని కీలక చమురు శుద్ధి కర్మాగారంపై జరిగిన దాడితో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్.. యూఏఈ, కువైట్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో గల్ఫ్ ప్రాంతం మళ్లీ యుద్ధ మేఘాలతో కమ్ముకుంది.
లావాన్ దీవిపై శత్రుదాడి..
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రోజే, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో ఇరాన్‌లోని లావాన్ దీవిలో ఉన్న క్రూడ్ ఆయిల్ రిఫైనరీపై ఊహించని దాడి (Middle East) జరిగింది. ఈ దాడిని ‘శత్రు చర్య’గా అభివర్ణించిన ఇరాన్ అధికారులు.. అగ్నిమాపక, భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారని వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది.
యూఏఈ, కువైట్‌పై క్షిపణుల వర్షం..
లావాన్ రిఫైనరీపై జరిగిన దాడిని (Middle East) సీజ్ఫైర్ ఉల్లంఘనగా పరిగణించిన ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. పొరుగున ఉన్న కువైట్, యూఏఈలలోని కీలక చమురు, మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడుల వర్షం కురిపించింది. ముఖ్యంగా కువైట్‌లోని మినా అల్-అహ్మదీ రిఫైనరీ, అబుదాబిలోని హబ్షాన్ గ్యాస్ కాంప్లెక్స్‌లను లక్ష్యంగా చేసుకుంది.
ఇవి కూడా చదవండి
అయితే, తమ అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు చాలా వరకు క్షిపణులను అడ్డుకున్నాయని యూఏఈ ప్రకటించింది. అయినప్పటికీ, కూలిపోయిన డ్రోన్ల శిథిలాలు పడి హబ్షాన్ గ్యాస్ సముదాయంలో అగ్నిప్రమాదం జరగడంతో కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అటు కువైట్‌లోని పవర్ స్టేషన్లు, వాటర్ డీసాలినేషన్ ప్లాంట్లపైనా ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడటంతో (Middle East) మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లినట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మా వేళ్లు ట్రిగ్గర్‌పైనే: ఐఆర్జీసీ
తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. శత్రువుల కపట హామీలను (Middle East) తాము ఏమాత్రం నమ్మడం లేదని, తమ వేళ్లు ఎప్పుడూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయని స్పష్టం చేసింది. సీజ్ఫైర్ ఉల్లంఘించి ఇకపై ఏ చిన్న దాడి జరిగినా, దానిపై తమ ప్రతిస్పందన ఊహించని రీతిలో, మరింత భయంకరంగా ఉంటుందని తేల్చిచెప్పింది.
అంతేకాకుండా, గల్ఫ్ ప్రాంతంలో (Middle East) అమెరికా, ఇజ్రాయెల్‌లకు వంతపాడుతున్న ప్రాంతీయ మిత్రదేశాలకు ఐఆర్జీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఆ రెండు దేశాల సామర్థ్యంతో పాటు వారి వైఫల్యాలను కళ్లారా చూసిన తర్వాతయినా గుణపాఠం నేర్చుకోకుండా వారికి సహకారం అందిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లో మళ్లీ తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి






