Trudeau: ట్రూడోకు షాక్ ఇచ్చిన ఉప ప్రధాని
కెనడాలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకున్నది. ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్ (Chrystia Freeland) తన పదవికి రాజీనామా చేశారు. ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మారుస్తున్నట్టు ట్రూడో (Trudeau) చెప్పిన క్రమంలో తన పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమని నిర్ణయించుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. క్యాబినెట్లో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఆమెకు గుర్తింపు ఉన్నది. విధాన నిర్ణయాలకు సంబంధించి ట్రూడోకు, ఆమెకు భేదాభిప్రాయాలు తలెత్తినట్టు తెలిసింది. దేశ ఆర్థిక సవాళ్లకు సంబంధించిన విషయాలను పార్లమెంట్‌కు వివరించాల్సిన కొద్ది గంటల ముందే ఆమె తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.






