California, కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ
అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియా (California )లో బర్డ్ ప్లూ (bird plow) కలకలం రేపుతోంది. 34 మందికి ఈ వైరస్ సోకడంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియా (Southern California) లోని డెయిరీ ఫాం ఆవుల్లో ఈ కేసులను గుర్తించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా చర్యలు తీసుకొంటున్నామని గవర్నర్ గవిన్ న్యూసమ్ (Gavin Newsom) వెల్లడిరచారు. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సంక్రమించిన దాఖలాలు లేవని తెలిపారు. ఇప్పటికాదా వైరస్ బారిన పడినవారంతా ఆ డెయిరీ ఫాం దగ్గర్లో ఉన్నవారు, అక్కడ పనిచేస్తున్న వ్యక్తులేనన్నారు. బర్డ్ ఫ్లూతో సాధారణ ప్రజలకు ముప్పేమీ లేదని అధికారులు తెలిపారు.






