Modi: ప్రధాని మోదీతో భూటాన్ రాజు భేటీ
ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ (India), భూటాన్ (Bhutan) నిర్ణయించుకున్నాయి. ప్రధానంగా శుద్ధ ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని తీర్మానించుకున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాణి జెత్సున్ పెమా వాంగ్చుక్తో కలిసి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ సంగ్వేల్ వాంగ్చుక్ భారత్కు చేరుకున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఆయనకు విమానాశ్రయంలో సాదరణ స్వాగతం పలికారు. అనంతరం మోదీ (Modi) తో వాంగ్ చుక్ (Wong Chuk) భేటీ అయ్యారు. భూటాన్ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి భారత్ అన్ని విధాలా చేయూతనందిస్తుందని ఆయనకు మోదీ (Modi) హామీ ఇచ్చారు. భూటాన్ ఆర్థిక ఉద్దీపన కార్యక్రమానికి సహకారం అందిస్తున్నందుకు గాను భారత్కు వాంగ్చుక్ కృతజ్ఞతలు తెలిపారు.






