ప్రపంచ కుభేరుడి వారసుడెవరో తెలుసా?

ప్రపంచ కుభేరుడు వారెన్ బఫెట్ తన వారసుడిని ప్రకటించారు. బెర్క్షైర్ హాత్‍వే సంస్థ వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్ తన వారసుడిగా కొనసాగుతారని తెలిపారు. వారెన్ బఫెట్ వయసు ప్రస్తుతం 90 ఏండ్లు దాటింది. మరో వైఎస్ చైర్మన్ అజిత్ జైన్‍ను కూడా పరిశీలించినప్పటికీ, వయస్సు కీలకంగా మారిందని చెబుతున్నారు. గ్రెగ్, అజిత్ ఇద్దరూ అద్భుత వ్యక్తులని బఫెట్ అన్నారు. బెర్క్ షైర్ వైస్ చైర్మన్ చార్లీ ముంగర్ కూడా యాన్యువల్ మీటింగ్ సందర్భంగా అబెల్ పేరును ప్రస్తావించారు. గ్రెగ్ అబెల్ (58)తో భర్తీ చేసేందుకు బోర్డు అంగీకారం తెలిపిందని స్వయంగా వారెన్ బఫెట్ ప్రకటించారు.