Syria : సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ సతీమణికి ప్రాణాంతక వ్యాధి!
తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో అధికారం కోల్పోయిన సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al-Assad )దేశాన్ని వీడి కుటుంబంతో సహా రష్యా(Russia) లో ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. అసద్ సతీమణి అస్మా(Asma) ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు తెలిసింది. గత కొంతకాలంగా లుకేమియా తో బాధపడుతున్న అస్మా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని తెలిసింది. ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది. అస్మా ఈ వ్యాధి బారిన పడినట్లు మేలో నాటి సిరియా అధ్యక్ష కార్యాలయం వెల్లడిరచింది. కాగా, 2019లో ఆమె రొమ్ము క్యాన్సర్‌ను జయించారు. ఏడాది పాటు చికిత్స తీసుకుని దాని నుంచి బటయపడ్డారు. ఆ తర్వాత కొన్నేళ్లకే ఆమె బ్లడ్ క్యాన్స్ర్ బారిన పడటం గమనార్హం.






