Barbados : ప్రధాని మోదీకి బార్బడోస్ ఉన్నత పురస్కారం

కొవిడ్ కాలంలో అమూల్య సేవలు, సమర్థ నాయకత్వం అందించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బార్బడోస్ (Barbados) దేశం ప్రతిష్ఠాత్మకమైన ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్ (Honorary Order of Freedom of Barbados) పురస్కారాన్ని ప్రదానం చేసింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో ప్రధాని తరపున మన దేశ విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గేరిటా (Pabitra Margherita) ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ పురస్కారాన్ని మోదీకి ఇవ్వనున్నట్లు బార్బడోస్ ప్రధాని మైయా అమోర్ మోట్లీ (Maia Amor Motley ) గత ఏడాది నవంబరు 20న ప్రకటించారు. కొవిడ్ కాలంలో మోదీ అంతర్జాతీయ సహకారాన్ని పటిష్ఠపరిచారని ఆయన ప్రశంసించారు.