United Nations : ఐరాస చేసిన తీర్మానానికి భారత్ మద్దతు

పాలస్తీనాకు సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ ఐక్యరాజ్యసమితి (United Nations) సర్వసభ్య సభ చేసిన తీర్మానానికి భారత్ (India) మద్దతు తెలిపింది. 193 సభ్యులు కలిగిన సర్వసభ సభలో భారత్‌తో సహా 142 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. 10 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడంతో పాటు ఇజ్రాయెల్ (Israel) , పాలస్తీనాలు తమ మధ్య ఉన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న న్యూయార్క్ డిక్లరేషన్ (New York Declaration) ను తీర్మానం సమర్థించింది.