TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్

తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న ఆమె, మరోసారి వీఐపీ (VIP) ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdhury) నిర్మలమ్మకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపం (Ranganayakula Mandapam) లో నిర్మలమ్మకు పండితులు ఆశీర్వచనం చేయగా, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.