Kangana Ranaut: కంగనా రనౌత్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కు సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్(Justice Vikramnath), జస్టిస్ సందీప్ మోహతా (Sandeep Mohta) లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా దర్మాసనం కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేవలం రీట్వీట్ కాదు, దీనికి మసాలా జోడిరచారు అంటూ ధర్మాసనం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన వ్యాజ్యాన్ని కొట్టివేసేందుకు ఇటీవల హైకోర్టు (High Court) తిరస్కరించిన సంగతి తెలిసిందే.