Bill Haggerty: భారత సైనికుల్ని కరిగించేందుకు ఆ ఆయుధాలు : బిల్ హాగెర్టీ సంచలన వ్యాఖ్యలు

భారత సైనికులను కరిగించేందుకు చైనా విద్యుదయస్కాంత ఆయుధాలను వాడిరదని అమెరికా సెనెటర్ బిల్ హాగెర్టీ (Bill Haggerty) ఆరోపించారు. ఐదేళ్ల కిందట సరిహద్దు ఘర్షణ సందర్భంగా డ్రాగన్ వాటిని మోహరించిందని పేర్కొన్నారు. సుదర్ఘీకాలంగా చైనా(China,), భారత్ మధ్య సంబంధాలు విశ్వాసలేమితో కొనసాగుతున్నాయి. ఐదు సంవత్సరాల క్రితం వివాదాస్పద సరిహద్దు వద్ద ఘర్షణపడ్డాయి. అప్పుడు చైనా విద్యుదయస్కాంత ఆయుధాలను ఉపయోగించింది అని బిల్ వ్యాఖ్యలు చేశారు. భారత్( India) చైనా సైనికుల మధ్య 2020లో గల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది. ఈ ఘటన తర్వాత రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే.