DGP Jitender: ఆమెకు రూ.25 లక్షల రివార్డు ఇస్తున్నాం : డీజీపీ

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. గద్వాల (Gadwala) ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళ నాయకురాలు. పశ్చిమబెంగాల్‌లో 2011 జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ (Kishenji) భార్య ఆమె. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జిగా ఉన్నారు. 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది. సుజాతక్క (Sujathakka) లొంగుబాటు వివరాలను డీజీపీ జితేందర్ (DGP Jitender) వెల్లడిరచారు. ఆమె స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు. ఆమె మొదట్లో ఆర్‌ఎస్‌యూ, జన నాట్యమండలి లో పని చేశారు. 1996లో కమాండర్‌గా విధులు నిర్వహించారు. 2001లో రాస్ట్ర కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. అనారోగ్య కారణాలతో సూజాతక్క బయటకి వచ్చారు. ఆమెకు రూ.25 లక్షల రివార్డు అందిస్తాం. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. మావోయిస్టులు చాలా మంది లొంగిపోతున్నారు అని డీజీపీ తెలిపారు.