AI Minister: ప్రపంచంలోనే తొలిసారి …. ఏఐ మంత్రి

ఐరోపా దేశమైన అల్బేనియా ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక మహిళా మంత్రిని నియమించింది. ఆ దేశ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ఈ ఏఐ మంత్రికి డి యెల్లా (Diella) అని పేరు కూడా పెట్టారు. అల్బేనియా (Albania) లో అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశ ప్రధాని ఏడీ రామా (AD Rama) ప్రకటించారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ విభాగంలో అవినీతి సమస్య అల్బేనియా ప్రభుత్వాన్ని చాలా ఏళ్లుగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్‌లో చేరాలన్న అల్బేనియా కలను నెరవేర్చుకోవడానికి అవినీతి నిర్మూలన కీలకంగా మారిందని ప్రధాని రామా అభిప్రాయపడ్డారు. పబ్లిక్ టెండర్లకు సంబంధించి ఎలాంటి అవినీతి జరగకుండా డియెల్లా నిఘా పెట్టనుందని, ప్రభుత్వ నిధులు పారదర్శకంగా కేటాయింపులు జరిగేలా పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.