Muhammad Yunus: యూనస్ కీలక ప్రకటన.. 2025 చివర్లో లేదంటే 2026లో
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Yunus) కీలక ప్రకటన చేశారు. 2025 చివర్లో లేదంటే 2026 లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. హసీనా (Hasina ) దేశం విడిచి పారిపోయి ప్రస్తుతం భారత్ (India) లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాలో మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిరది. ఈ నేపథ్యంలో తదుపరి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






