Canada: కెనడాలో శాశ్వత నివాసానికి దరఖాస్తులు
తమ దేశానికి వలసల సంఖ్యను పెంచడానికి కెనడా (Canada) సిద్దమైంది. ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ ( పీఎన్పీ) కింద విదేశీ పౌరులు శాశ్వత నివాస హోదా పొందేందుకు ట్రూడో (Trudeau) ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికోసం ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ (ఈఈఎస్) ద్వారా మొత్తం 1,085 మంది నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు కెనడా వలసలు, శరణార్థులు, పౌరసాత్వ శాఖ ( ఐఆర్సీసీ) ఈ నెల 16న ప్రకటన విడుదల చేసింది. ఇదే కార్యక్రమం కింద ఈ నెల 2న 672 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తాజా నిర్ణయంతో కెనడాలో శాశ్వత నివాసం పొందాలని భావించే భారతీయ (Indian ) వృత్తి నిపుణులకు బారీ లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. విదేశీ పౌరులు నిర్దిష్ట ప్రావిన్స్‌లో నివసించడానికి, పనిచేయడానికి పీఎన్పీ అనుమతిస్తుంది.






