American Airlines: అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాలకు అంతరాయం
క్రిస్మస్ సెలవుల్లో ప్రయాణాలు గణనీయంగా పెరిగిన వేళ అమెరికా(America) లో మంగళవారం పలు విమానాలు గంటసేపు నిలిచిపోయాయి. అమెరికన్ ఎయిర్లైన్స్ (American airlines )కు చెందిన విమానాలు ఇలా ఆగిపోవడానికి సాంతికేక సమస్య కారణమని సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. ఆ సమస్య ఏమిటనేది వివరించలేదు. న్యూయార్క్(New York), డాలస్-ఫోర్ట్ వర్త్(Dallas-Fort Worth), షాలెట్ (Charlotte) విమానాశ్రయాలపై ఎక్కువ ప్రభావం పడిరది. మంచు విపరీతంగా కురుస్తుండటం కూడా ప్రతికూలంగా మారింది. విమాన సేవల్లో అంతరాయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకు రావాల్సిన, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 1,447 సర్వీసులపై ప్రభావం పడిరది. దీంతో అనేక మంది ఇబ్బందిపడ్డారు. గంట తర్వాత విమాన సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. సెలవులు కావడంతో రాబోయే పది రోజుల్లో లక్షల సంఖ్యలో ప్రయాణికులు విమానాల్లో రాకపోకలు చేస్తారని అంచనా.






