WHO: డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగనున్న అమెరికా!
అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన మొదటి రోజే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో) (WHO) నుంచి అమెరికా తప్పుకునేలా కీలక నిర్ణయం వెలువడుతుందని తెలుస్తున్నది. నాకు కచ్చితమైన సమాచారముంది. ట్రంప్ అధికారం చేపట్టిన మొదటి రోజు లేదా పాలన ప్రారంభమైన వెంటనే ఈ నిర్ణయం ఉంటుంది అని జార్జ్‌టౌన్ వర్సిటీ (Georgetown University) కి చెందిన ఆరోగ్య నిపుణుడు లారెన్స్ గోస్టిన్ తెలిపారు. డబ్ల్యూహెచ్‌వోపై మొదట్నుంచీ ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.






