Afghanistans: ఆ దేశంలో మహిళలపై సరికొత్త ఆంక్షలు.. అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆదేశాలు
అఫ్గానిస్థాన్లో మహిళలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాలిబన్లు ఫత్వా(Taliban Fatwa) జారీ చేశారు. ఇంట్లోని మహిళలను బయటవారెవరూ చూడకుండా కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అందుకోసం ఇళ్లకు అసలు కిటికీలు(Windows) పెట్టకూడదని హుకుం జారీ చేశారు. మహిళలు ఎక్కువ సేపు కాలం గడిపే వంటగదులు, బావుల వద్ద కిటికీలు ఉండకూడదని తెలిపారు. ఇప్పటికే కిటికీలు ఉంటే వాటిని మూసివేయాలని ఆదేశించారు. ఇస్లామిక్ చట్టం (Islamic law) ప్రకారం ఇప్పటికే మహిళలపై తాలిబన్ ప్రభుత్వం పలు ఆంక్షలు పెట్టింది. ఆడపిల్లలు ప్రాథమిక విద్యను మించి చదవకూడదు. మహిళలు ఉద్యోగాలు చేయకూడదు. పార్కులకు కూడా వెళ్లకూడదు.






