Syria: తక్షణమే ఆ దేశాన్ని వీడండి… భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతోంది. తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తుండటంతో ప్రభుత్వ దళాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ (Department of Foreign Affairs ) కీలక ప్రకటన చేసింది. భారత పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని అడ్వైజరీ జారీ చేసింది. సిరియా (syria) లో ప్రస్తుతం నెలకొన్న ఉద్త్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులెవరూ తదుపరి నోటిషికేషన్ జారీ చేసేవరకు ఆ దేశానికి వెళ్లొదని సూచిస్తున్నాం. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలి. అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్ (Damascus) లోని ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉండాలి. అత్యవసర సహాయం కోసం +963993385973 ను సంప్రదించాలి. సిరియాలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.






