Rohith Sharma: ఆ ఇద్దరూ టీంలోకి రావచ్చు, రోహిత్ సంచలనం
భారత జట్టులో తిరిగి పునరాగమనం చేయడానికి భారత సీనియర్ ఆటగాళ్ళు అజింక్యా రహానే(Rahane), చటేస్వర్ పుజారాలకు ఇంకా అవకాశం ఉందన్నాడు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్ శర్మ… ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఛెతేశ్వర్ పుజారా(Pujara), అజింక్యా రహానే (Ajinkya Rahane), రవిచంద్రన్ అశ్విన్ (Aswin) లాంటి దిగ్గజాలు లేని భారత టెస్ట్ టీం ఎలా ఉందని రోహిత్ ను ఓ విలేఖరి ప్రశ్నించాడు. కచ్చితంగా వాళ్ళను తాను మిస్ అవుతా అన్నాడు రోహిత్. ఈ సందర్భంగా తన మార్క్ ఆన్సర్ ఇచ్చాడు.
అజింక్యా రహానే రిటైర్మెంట్ తీసుకోలేదన్నాడు. మీరు నన్ను అనవసరంగా ఇబ్బందుల్లో పడేస్తారంటూ నవ్వేసాడు. అంతేకాకుండా… పుజారా, అజింక్య రహానేలు టెస్టుల్లో పునరాగమనం చేసేందుకు ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయన్నాడు రోహిత్. ముగ్గురూ రిటైర్డ్ అయినట్లే చెబుతున్నారని… పుజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించలేదన్నాడు. మీరు వారందరి పేర్లను కలిపి తీసుకున్నారని… అందుకే నేను వారి గురించి మాట్లాడా అన్నాడు. వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ లేరు అని… వారికి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయన్నాడు.
ఇక పుజారా, రహానే 2010ల ప్రారంభం నుండి 2020ల ప్రారంభం వరకు భారత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచారు. పుజారా 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. 176 ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు. అతని అత్యుత్తమ స్కోరు 206 నాట్ అవుట్. భారత్ తరఫున పుజారా ఐదు వన్డేలు కూడా ఆడాడు. రహానే భారత్ తరఫున 85 టెస్టులు ఆడాడు, 38.46 సగటుతో 5,077 పరుగులు చేశాడు, 144 ఇన్నింగ్స్ ల్లో 12 సెంచరీలు,26 అర్ధసెంచరీలు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 188.






