Indians: స్ఫూర్తిదాయక మహిళల జాబితాలో భారతీయులకు చోటు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత స్ఫూర్తిదాయకమైన 100 మంది మహిళల జాబితాను బీబీసీ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో మన దేశానికి చెందిన ముగ్గురు మహిళలు చోటు దక్కించుకోవడం విశేషం. సామాజిక కార్యకర్త అనుణారాయ్(Anunarai), రాజకీయవేత్తగా మారిన రెజ్లర్ వినేష్ ఫొగట్ (Vinesh Phogat), అంత్యక్రియల పయనీర్గా గుర్తింపు పొందిన పూజాశర్మ (Pooja Sharma) ఉన్నారు. వీరితో పాటు భారతీయ అమెరికన్లు నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఏఐ నిపుణురాలు స్నేహ రేవనూర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అలాగే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నదియా మురాద్, హాలీవుడ్ నటి షారన్ స్టోన్, వాతావరణ కార్యకర్త అడెనికే ఒలాడోసు, అత్యాచార బాధితురాలు గిసెల్ పెలికాట్ కూడా స్ఫూర్తివంతమైన మహిళలుగా ఎంపికయ్యారు.






