Canada: కెనడాలో మరో భారతీయ విద్యార్థి హత్య
కెనడాలో మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని 20 ఏళ్ల హర్షందీప్సింగ్ (Harshandeep Singh) గా గుర్తించారు. ఎడ్మోంటెన్ అపార్ట్మెంట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఇతడిపై అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను ఇవాన్ రైన్ (Ivan Rain), జులిత్ సాల్టాక్స్ (Juliet Saltax) గా పేర్కొన్నారు. కాల్పుల గురించి సమాచారం అందగానే 107వ అవెన్యూ ఏరియాకు వెళ్లిన పోలీసులు అపార్ట్మెంట్ వద్ద అపస్మారక స్థితిలో పడివున్న సింగ్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు దుండగులు సింగ్ను మెట్లపై పడేసి, వెనుకవైపు నుంచి కాల్పులు జరిపారని సీసీటీవీ పుటేజీలలో నిర్ధారణైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేపట్టినట్లు వెల్లడిరచారు.






