డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడి కరోనా
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మిడోస్ కరోనా వైరస్ బారిన పడినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రచార సహాయకుడు నిక్ ట్రైనర్‌కు కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. కాకపోతే, వారికి ఎప్పుడు వైరస్ సోకిందనే విషయంంలో మాత్రం సృష్టత లేదని స్థానిక మీడియా వెల్లడించింది. కాగా ట్రంప్ సహ్నితుల్లో వైరస్ బారిన పడిన వారంలో మిడోస్ తాజా వ్యక్తి. మిడోస్ నార్త్ కరోలినాకు చెందిన మాజీ శాసనసభ్యుడు. ట్రంప్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఎప్పుడూ ఆయన వెంటే కనిపించేవారు. ఇటీవల అధ్యక్షుడి మద్దతుదారులు పాల్గొన్న వైట్‌హౌస్ ఎలక్షన్ నైట్ పార్టీకి కూడా ఆయన హాజరు కావడం గమనార్హం. ఈ అధికారి కూడా ట్రంప్‌లా మాస్క్ ధరించకుండా బహిరంగ కార్యక్రమాల్లో దర్శనమిస్తుంటారు.






