TTA: టిటిఎ చరిత్రలో మరపురాని ఘట్టం…10వ వార్షికోత్సవ వేడుకల సంబురం
అమెరికాలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహిస్తూ, మరోవైపు తెలంగాణ కమ్యూనిటీని ఒకే వేదికపై తీసుకురావడంలో కృషి చేసిన తెలంగాణ అమెరికన్ తెలుగుఅసోసియేషన్ (TTA) తన దశమ వార్షికోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహించి అందరిచేత ప్రశంసలను అందుకుంది. డిసెంబర్ 25వ తేదీన హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న శిల్పకళా వేదికలో జరిగిన ఈ దశమ వార్షికోత్సవ వేడుకల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను ఏర్పాటుచేసింది. టీటీఏ వ్యవస్థాపకులు పైళ్ల మల్లారెడ్డి, అడ్వయిజరీ కౌన్సిల్ చైర్ డా.విజయ్‌పాల్‌రెడ్డి, కో-చైర్ డా. పట్లోళ్ల మోహన్‌రెడ్డి, సభ్యులు భరత్ మధాడి, శ్రీని అనుగు మాజీ అధ్యక్షుడు వంశీ రెడ్డి, అధ్యక్షుడు నవీన్‌రెడ్డి మల్లిపెద్ధి, వార్షికోత్సవ వేడుకల కమిటీ చైర్మన్ డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి తదితరులు జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు.
అమెరికాలోని న్యూజెర్సిలో 2015లో ప్రముఖ పారిశ్రామికవేత్త డా. పైళ్ల మల్లారెడ్డి ఆలోచనల నుంచి ఏర్పడిన టిటిఎ నాటి నుంచి నేటివరకు అమెరికాలోని తెలంగాణ కమ్యూనిటీకి, తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు ప్రజలకు తనవంతుగా సేవలను అందిస్తూ వస్తోంది. సాంస్కృతిక కళలను, పండుగలను, వేడుకలను వైభవంగా నిర్వహిస్తోంది. వేలాదిమంది సభ్యులతో అమెరికాలో అతి పెద్ద జాతీయ తెలంగాణ సంస్థగా గుర్తింపు పొందింది.

దశమవార్షికోత్సవాల్లో భాగంగా శిల్పారామంలో ప్రదర్శించిన వివిధ కళా ప్రదర్శనలు, సాహిత్య కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బతుకమ్మ బోనాలు ఒగ్గు డోలు దప్పు గుస్సాడి బంజారా కొమ్ము కోయ, పోతురాజు వంటి కళారూపాలను ప్రదర్శించి తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పారు. తెలంగాణ ధూమ్ ధామ్, పాటల విందు మరో ఆకట్టుకున్న కార్యక్రమం రాము రాథోడ్, మధు ప్రియ, రేలారే గంగ కల్యాణ్ కీస్, అంతడుగుల నాగరాజు నేతృత్వంలో జరిగిన రసమయి బాలకిషన్ టీ ధూమ్ ధామ్ కార్యక్రమం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అలాగే తెలంగాణ పాటకు సలాం పేరుతో జరిగిన కార్యక్రమంలో విమలక్క,గూడ అంజన్న, వరంగల్ శ్రీనివాస్ వంటి ప్రముఖ గాయకులు తమ గళంతో అలరించారు. మోహన భోగరాజు, మౌనిక యాదవ్, శివనాగులు, రేలా రవి వంటి కళాకారుల జానపద జుగల్బందీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సందీప్ బృందం ప్రదర్శించిన పేరిణి నృత్య వైభవం, డాక్టర్ ప్రియాంక భార్డె బృందం ప్రదర్శించిన ఏకమ్ అర్ధనారీశ్వరం నృత్య రూపకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రముఖ రచయితలు గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, రచయిత్రి శ్రీమతి రమాదేవి నెల్లుట్ల పాల్గొని తెలంగాణ సాహిత్యంపై మాట్లాడారు. వేడుకల ప్రారంభంలో భాగంగా ప్రముఖ రచయితలు అందెశ్రీ, గద్దర్, వడ్డేపల్లి కృష్ణలకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ సాంస్కృతిక కమిటీ చైర్ డా’’ వాణి గడ్డం, సలహాదారు రమా వనమా వార్షికోత్సవ వేడుకల కమిటీ చైర్మన్ డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి, అధ్యక్షుడు నవీన్‌రెడ్డి మల్లిపెద్ధి ధన్యవాదాలు చెప్పారు. ఈ వేడుకల కోసం నరసింహ పెరుక ఆడియో, వీడియోవిజువల్స్ ను అందించారు. ఈ వేడుకలను డా’’ వాణి గడ్డం, సలహాదారు రమా వనమా శ్రమతో ఘనంగా నిర్వహించారు.
దశమవార్షికోత్సవాల్లో భాగంగా అవార్డ్స్ కమిటీకి చెందిన సంగీతా రెడ్డి, శివ రెడ్డి నామినేట్ చేసిన అవార్డు గ్రహీతలు శ్రీ చుక్కా రామయ్య(విద్యారంగం), శ్రీ కె. రాజేంద్ర కుమార్ (రిటైర్డ్ ఐపీఎస్) దేశ సేవలో విశిష్ట సేవలకుగాను, దివంగత డా. వడ్డేపల్లి కృష్ణ (సాహిత్య ప్రతిభ), శ్రీ పసుమర్తి రంగారావు(కమ్యూనిటీ సర్వీస్), శ్రీమతి కీర్తి జల్లి, ఐఎఎస్ (పబ్లిక్ సర్వీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్), శ్రీమతి విహ రెడ్డి ఉన్నలగడ్డ (స్పోర్ట్స్) శ్రీ పి. ప్రమోద్ రెడ్డి (సాంస్కృతికరంగం), డా. సునీత కృష్ణన్ (స్పెషల్ రికగ్నిషన్), శ్రీమతి రామలీల నందా(హ్యూమానిటేరియన్ సర్వీస్), శ్రీమతి అనిత చావలి (గ్రీన్ విజనరీ)లకు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, విద్యుత్ శాఖ మాజీ మంత్రి మరియు సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి, చామకూర మల్లా రెడ్డి, వెంకట రమణ రెడ్డి, గడారి కిశోర్ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు.
పది సంవత్సరాల టిటిఎ సేవా మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతిబింబించే దశాబ్ది వార్షికోత్సవ మ్యాగజైౖన్ (సావెనీర్) ను శ్రీనివాస్ గూడూరు, సునిల్ గడ్డం మరియు కవితా రెడ్డి డిజైన్ చేయగా, టీటిఎ బృందం ఈ వేదికపై ఘనంగా ఆవిష్కరించింది. ఈ వేడుకల కోసం రఘు ఆలుగుబెల్లి, జేమీడియా తో కలిసి వేదికను అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు జేమీడియా ఈవెంట్ పార్ట్నర్గా వ్యవహరించింది.
అమెరికాలోని ఎన్నారైలు హైదరాబాద్ లో ఇంత పెద్దఎత్తున కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుని నిర్వహించడం అంత సులభమైన పని కాకపోయినా టీమ్ అంతా కలిసి ఈ వేడుకలను దిగ్విజయం చేసి చూపించాయి. ఇందులో అందరి కృషితోపాటు, ఐక్యత,అంకితభావమే ఈ వేడుకలను విజయవంతం చేశాయి. అలాగే 10వ వార్షికోత్సవ కోర్ టీమ్ కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసింది. మొదటి రోజు నుండి నిధులు, మద్దతు, సాంస్కృతిక కార్యక్రమాలు, జనాల మేనేజ్మెంట్.. ఇలా ప్రతి విషయంలోనూ ఆందోళనలు ఉన్నా, టీమ్ ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అడుగు అడుగునా ప్రతి విభాగంపై పట్టు సాధించి, సవాళ్లను విజయాలుగా మార్చుకుంది.
ముఖ్యంగా వేడుకల కమిటీ కో చైర్ అప్పిరెడ్డి, కల్చరల్ కో-చైర్ సంతోష్ గంటారం, హాస్పిటాలిటీ టీమ్ పల్లవి రామిడి, జ్యోతి రెడ్డి, సహోదర్, స్వాతి చెన్నూరి, ఎంతో సహకారం అందించారు. ముఖ్యంగా జ్యోతి రెడ్డి జనసమీకరణ లో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ విభాగం కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. అరోమా కిచెన్ ` సదరన్ స్పైస్ లంచ్ 500 మందికి, రాత్రి దాదాపు 3400 మందికి పైగా వచ్చినవారందరికీ భోజనాలు అందించారు. లైవ్ కౌంటర్లు, వెడ్డింగ్ స్టైల్ మెనూ, అద్భుతమైన రుచి దాదాపు 100 మంది సిబ్బంది వడ్డన మరియు శుభ్రత కోసం నిరంతరం పనిచేయడం వచ్చినవారిని సంతోషపరిచింది. దాంతోపాటు భోజనాలు రుచికరంగా ఉన్నాయంటూ అందరూ ప్రశంసించడం విశేషం. డా’’ పైళ్ల మల్లారెడ్డి దంపతులు అన్నదాతలుగా ముందుకొచ్చారు.
ఈ వేడుకల విజయవంతానికి సహకరించిన స్పాన్సర్స్ అందరికీ ధన్యవాదాలు. జె మీడియా నరేన్ (నరేందర్), ఆకాష్, స్టేజ్ సెటప్, బ్యాక్‌డ్రాప్స్, బ్రాండిరగ్ ఇలా అన్నింటినీ ఒక పెద్ద కన్వెన్షన్ స్థాయిలో అందించారు. థీమ్స్ ఫైనలైజ్ చేయడానికి గంటల తరబడి సమయం కేటాయించారని వేడుకల కమిటీ చైర్మన్ డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి అన్నారు. అమెరికా నుండి ప్రయాణించి వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సేవాడేస్ సమన్వయకర్త విశ్వ కంది, ఇండియా సమన్వయకర్త డా ద్వారకనాథరెడ్డి, ప్రవీణ్ చింతా, మధుకర్ రెడ్డి బీరం, వెంకట్ అన్నపురెడ్డి, శ్రీకాంత్ గాలి, మల్లిక్ రెడ్డి, ఉష రెడ్డి, మయూర్ బండారు, ప్రదీప్ బొద్దు, దివాకర్ జంధ్యం, నరేష్ బైనగరి, వెంకట్ (షార్లెట్), ప్రశాంత్ తోపాటు ఈ వేడుకలకు వచ్చిన అతిథులకు, వాలంటీర్లకు అందరికీ టిటిఏ దశమ వార్షికోత్సవ కమిటీ ధన్యవాదాలు తెలియజేసింది.






