30 సెకండ్లలోనే కరోనా ఖతం
లోహాలు, ప్లాస్టిక్, ఇతర వస్తువుల ఉపరితలాలపై ఉండే కరోనా వైరస్ను ప్లాస్మా జెట్టు 30 సెకండ్లలోనే చంపేస్తాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఏ పదార్ధాలైనా సాధారణంగా ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటాయి. కానీ నాలుగో స్థితి కూడా ఉంటుంది. ఈ నాలుగో స్థితిని ప్లాస్మా అంటారు. ప్లాస్మా జెట్ గాలిపై పీడనాన్ని పెంచి వాయువును ప్లాస్మా స్థితిలోకి మార్చుతుంది. ఈ ప్లాస్మాను ఉపరితలాలపై స్ప్రే చేయడం ద్వారా వైరస్ను చంపవచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా ఆర్గాన్ వాయువును ఒత్తిడికి గురిచేసి ప్లాస్మా రూపంలోకి మార్చి పరీక్షించి విజయం సాధించారు.






