అమెరికా కరోనా టాస్క్ ఫోర్స్ బృందంలో సెలిన్ గౌండర్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కొత్తగా ఏర్పాటు చేసిన కరోనా టాస్క్ ఫోర్స్ బృందంలో భారత సంతతికి చెందిన సెలిన్ గౌండర్ స్థానం పొందారు. సెలిన్ గౌండర్ తండ్రి రాజ్‌ది తమిళనాడులోని ఈరోడ్ జిల్లా పెరుమాపాళ్యం గ్రామం. ఆయన 1966లో అమెరికాకు వెళ్లి అక్కడి విమానాయాన సంస్థలో పని చేస్తూ సహా ఉద్యోగినిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, వారిలో పెద్ద కుమార్తె సెలిన్ గౌండర్. ఈమె అమెరికాలోనే పుట్టి పెరిగారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, క్షయ నివారణ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.






