కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వల్ల ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా మృతి చెందారు. ఢిల్లీలో ఓ ఆస్పత్రిలో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కరోనా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భార్య కూడా కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందింది. సురేంద్ర సింగ్ జీనా మరణం పట్ల ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సంతాపం తెలిపారు. రాష్ట్రం శక్తివంతమైన నాయకుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి అన్నారు.






