ట్రంప్ హయాంలో మా సంబంధాలు దెబ్బతిన్నాయి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా- రష్యా మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్ పుతిన్ అన్నారు. కార్వనిర్వహణ స్థాయిలో ముఖ్యంగా సైనిక వ్యవహారాల్లో విశ్వసస్థాయి మెరుగుపడకపోగా చాలావరకు దిగజారిందనే చెప్పాలి అని పుతిన్ పేర్కొన్నారు. మాస్కోలో అమెరికా విదేశాంగమంత్రి రెక్స్ టిల్లర్సన్, రష్యా విదేశాంగమంత్రి సెర్గెయ్ లావ్రోవ్ మధ్య ఉత్కంఠభరిత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
