ఆటాలో వివాహ పరిచయవేదిక
ఆటా మహాసభల్లో భాగంగా వివాహ పరిచయ వేదికను కూడా ఏర్పాటు చేశారు. అమెరికాలోని తెలుగువారికోసం ఈ వేదికను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పెళ్ళికాని యువతీ యువకులు, వారి తల్లితండ్రులు ఒకే వేదికపైకి వచ్చి తమకు నచ్చిన వధూవరులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఆటా కాన్ఫరెన్స్ నిర్వాహకులు ఈ కార్యక్రమం ద్వారా కల్పించారు. జూన్ 8, 9 తేదీల్లో ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజును 50 డాలర్లుగా నిర్ణయించారు.
