అమెరికా భద్రతకు భారతే కీలకం
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తన భద్రతకు భారత్ కీలకమైన దేశామని భావిస్తోందని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. అమెరికా ఇటీవల భారత్‌కు వచ్చిన ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను అమలు చేయడానికి ఉద్దేశించిన ప్రక్రియను ట్రంప్ పాలనాయంత్రాంగం ప్రారంభించిందని పెంటగాన్ పేర్కొంది. భారత్, అమెరికా మధ్య సంబంధాలు సజావుగా సాగుతున్నాయని, రక్షణ మంత్రి జేమ్స్ మట్టిస్ భారత్‌తో రక్షణ సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పెంటగాన్ అధికార ప్రతినిధి క్యాప్టెన్ జెఫ్ డేవిస్ ఒక వార్తసంస్థకు తెలిపారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్తులో అమెరికా భద్రతకు భారత్‌ను కీలకమైన దేశంగా జేమ్స్ భావిస్తున్నారని డేవిస్ చెప్పారు. జేమ్స్ మట్టిస్ పెంటగాన్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కె దోవల్‌తో జరిపిన సమావేశం విజయవంతమైన కొన్ని వారాల తరువాత డేవిస్ ఈ విషయం చెప్పారు.
