దూరదృష్టే లేని ట్రంప్ – తులసీ గబార్డ్
ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా నిర్లక్ష్యపూరితంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిరియాపై దాడి చేయించారని హవాయిన్ ప్రాంతం నుంచి అమెరికా కాంగ్రెస్కు ఎంపికైన తొలి హిందూ మహిళ, డెమొక్రాట్ తులసీ గబార్డ్ తప్పుబట్టారు. (ట్రంప్ ప్రభుత్వం) నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సిరియాపై దాడులు చేస్తే తదుపరి జరగబోయే పరిణామాలు ఏమిటనే విషయంలో ఎవరినీ సంప్రదించలేదు. అదీ కాకుండా అసలు సిరియాలో జరిగింది కెమికల్ దాడులా కాదా అని నిర్ధారించుకోలేదు. ఇవేం చేయకుండానే ఏకపక్షంగా దాడి చేయడం సరికాదు అంటూ ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
