మలాలాకు అరుదైన గౌరవం
బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్కు అత్యున్నత గౌరవం లభించింది. ఆమెను శాంతిదూతగా ఎంపిక చేసినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఐరాస శాంతిదూతగా నియమితులరాలైన అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా నిలిచారు. వచ్చే వారం యూఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆమెకు ఈ హోదా ఇవ్వనున్నారు. మహిళలు, యువతుల హక్కు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతూ మలాల అసాధారణ ప్రతిభ కనబరుస్తుంది అందుకే శాంతిదూతగా ఎంపిక చేసినట్లు గుటెరస్ వెల్లడించారు. బాలికల విద్యా హక్కు కోసం మలాలా ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. శాంతిదూతగా మాలాలను ఎంపిక చేయడం వల్ల మహిళలకు మరింత మేలు చేకూరుతుందని తెలిపారు. 19 ఏళ్ల మలాలా బాలిక విద్య కోసం పోరాడుతూ ఓ చిహ్నంలాగా నిలిచిందని కొనియాడారు. ఐరాస కార్యకలాపాలను, ఆదర్శభావాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు బాగా పాపులర్ అయిన ప్రముఖులను శాంతిదూదగా ఎంపిక చేయడం జరుగుతోంది.
