డొనాల్డ్ ట్రంప్ మరో వ్యాపారం మూతపడింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన మరో వ్యాపారం మూతపడింది. ట్రంప్ కుటుంబానికి చెందిన మోడలింగ్ ఏజెన్సీ ట్రంప్ మోడల్స్ మూతపడింది. ఈ మేరకు ఏజెన్సీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ట్రంప్ మోడల్స్ మూసివేయడం వెనుక కారణాలపై సృష్టత లేదు గానీ, ఇటీవల ఈ ఏజెన్సీకి సరైన ప్రాజెక్టులు రావట్లేదని సమాచారం. ఇటీవలే ట్రంప్ మోడల్స్ మేనేజర్ సంస్థ నుంచి తప్పుకొని, కొత్తగా ఏజెన్సీ ప్రారంభించినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అంతేగాక, ట్రంప్ ఏజెన్సీ నుంచి చాలా మంది మోడల్స్‌ను సదరు మేనేజర్ తీసుకెళ్లినట్లు మీడియా పేర్కొంది. దీంతో ట్రంప్ మోడల్స్ మూసివేతకు ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మరో వైపు ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ మోడల్స్‌కు చెందిన మ్యాగీ రైజర్ అనే మోడల్ ఏజెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
