డొనాల్డ్ ట్రంప్ కు వినపడలేదంట!
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో కరచాలనం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారన్న వార్తలను ట్రంప్ ప్రతినిధి తిరస్కరించారు. మీడియా కెమెరాల ముందు కరచాలనం చేసుకుందామా అని మెర్కెల్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ వినిపించుకున్నారని నేననుకోవడం లేదు అని ఆ ప్రతినిధి సియాన్ స్పైసర్ తెలిపారు. గత వారం మెర్కెల్ అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్ ప్రవేశ ద్వారం వద్ద ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. కానీ, తర్వాత ఓవల్ కార్యాలయంలో ఇరువురు పక్కపక్కన కూర్చున్నపుడు మరోసారి మీడియా కోసం కరచాలనం చేసుకుందామని అని మెర్కెల్ అడిగిన ప్రశ్న ట్రంప్‌కు వినిపించలేదో లేక కావాలనే పట్టించుకోలేదని అని గుసగుసలు ప్రారంభమయ్యాయి. మీడియా ఈ అంశాన్ని ప్రముఖంగానే ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
