హెచ్ 1బీ వీసాపై కొత్త నిబంధన
హెచ్1బీ వీసాల జారీ విధానంపై అమెరికా మరింత కఠినతరమైన ఆంక్షలను విధించనుంది. ట్రంప్ ప్రభుత్వం దీనికి సంబంధించి కొత్త నియమావళిని అమలులోకి తెచ్చింది. వాస్తవానికి ప్రతి ఏడాది మార్చి 3వ తేదీ నుంచి హెచ్1బీ వీసా సీజన్ మొదలవుతు. దీంతో ట్రంప్ ప్రభుత్వం నేటి నుంచి వర్కింగ్ వీసాలకు కావాల్సిన అర్హతలపై కఠినమైన ఆంక్షలను వెల్లడించింది. గత అమెరికా ప్రభుత్వాలు వీసాల జారీ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించాయని ట్రంప్ సర్కార్ ఆరోపణలు చేసింది. అంతే కాదు, ట్రంప్ ప్రభుత్వానికి చెందిన న్యాయశాఖ కూడా ఐటీ కంపెనీలకు తీవ్ర హెచ్చరికలు చేసింది. వీసాల జారీ కోసం అమెరికాకు చెందిన ఉద్యోగులను పక్కన పెట్టడాన్ని సహించబోమని న్యాయశాఖ ఐటీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ స్థానిక ఉద్యోగులకు పక్కనపెడితే, ఆ అంశాన్ని విచారించి చర్యలు తీసుకునేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని కూడా హెచ్చరించారు.
