హెచ్1బీ వీసా అవకతవకలపై ట్రంప్ దృష్టి
హెచ్1బీ వీసా దుర్వినియోగం, ఇందులో అవకతవకలపై దృష్టి సారించినట్లు అమెరికా హోమ్ ల్యాండ్ భద్రతా అధికారులు సోమవారం ప్రకటించారు. ఉద్యోగాలనిమిత్తం అమెరికాకు వలసవెళ్లే సాఫ్ట్ వేర్(ఐటీ సంబంధిత ప్రోగ్రామర్స్, డెవలపర్స్, ఇతర టెక్నికల్ ఉద్యోగులు) రంగానికి చెందిన విదేశీ ఉద్యోగులకు ఇక నుంచిసమస్యలు తప్పేలా కనిపించడం లేదు. అమెరికన్ కంపెనీలు స్థానిక కంపెనీలకే ప్రాజెక్టులు ఇవ్వడం మొదలుపెడితే, భారత ఐటీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టంవాటిల్లుతుంది. దాంతో పాటు అక్కడికి వెళ్లే సాఫ్ట్ వేర్ ఉద్యోగులలో భారతీయుల అధికంగా ఉండటం వారిని కలవరపెడుతుంది. ప్రతి ఏడాది 65000 మంది లాటరీసిస్టమ్ తో హెచ్1బీ వీసా అందుకుని సాఫ్ట్ వేర్ జాబ్స్ పేరిట అమెరికాకు వస్తున్నారని, వీరి రాకకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటామని ట్రంప్ గతంలోనేపేర్కొన్నారు. చాలా తక్కువ సంఖ్యలో హెచ్1బీ వీసాలు ఇవ్వాలని, పారదర్శకత పాటించాలని జస్టిస్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లు ఓఅధికార ప్రతినిధి పీటర్ రొబ్బియో తెలిపారు.
