భారత్కు అమెరికా చమురు
భారత దేశం వంటి మిత్ర దేశాలకు చమురు, సహజ వాయువును ఎగుమతి చేయాలని ట్రంప్ పాలనా యంత్రాంగం భావిస్తోంది. ఉన్నతస్థాయి మంత్రివర్గ అధికారి ఒకరు ఈ విషయం చెప్పారు. విదేశాల్లో చమురు అన్వేషణకు అడ్డంకులను తొలగించే పనిలో ట్రంప్ ఉండగా అమెరికా అంతరంగిక శాఖ కార్యదర్శి ఈ విషయం చెప్పారు. తమ దేశానికే కాక, మిత్ర దేశాలకు కూడా చమురు విషయంలో స్వేచ్ఛ ఉండాలన్నది ట్రంప్ అభిమతమని ఆయన చెప్పారు. ముఖ్యంగా ద్రవీకృత సహజ వాయువును మిత్ర దేశాలకు ఎగుమతి చేయదలచామని చెప్పారు. ఇందుకు మౌలిక సౌకర్యాల కల్పన సాగిస్తున్నామని తెలిపారు.
