ఆటా కాన్ఫరెన్స్లో శ్రీదేవికి నివాళి కార్యక్రమం
అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభల్లో సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ సమావేశాలతోపాటు బిజినెస్, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ నటి, తెలుగు తమిళ హిందీ భాషల్లో అగ్రశ్రేణి నటిగా పేరు పొందిన శ్రీదేవిని స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి నటించిన చిత్రాలు, పాటలను గుర్తుకు తెచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు చెప్పారు.
