చర్మ వ్యాధే అమెకు ప్లస్ పాయింట్
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఆష్ సోటో అనే యువతి తన మైనస్ పాయింట్‌నే ప్లస్ పాయింట్‌గా మార్చుకొని ఇప్పుడు సోషల్ మీడియా రాణిగా మారింది. ఆమె ఒంటి నిండా బొల్లి వ్యాధితో బాధపడుతోంది. అయినప్పటికీ ఆమెలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లలేదు. 12వ ఏటే ఆమె బొల్లి వ్యాధికి గురై, చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడడంతో ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగి విసిగిపోయింది. ఫలితం దక్కకపోవడంతో బాధ పడిపోయేది. తాను ఎక్కడకు వెళ్లినా అందరూ వింతగా చూస్తున్నారని బాధ పడిపోయేది. అయితే బాధ పడుతూ కూర్చుంటే తనకు ఉన్న వ్యాధి తగ్గదు కదా అని ఆలోచించింది. ఏదైనా ఒకటి విభిన్నంగా చేసి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని భావించింది. తన శరీరంపై ఉన్న తెల్లమచ్చలను ఒకదానికొకటి కలుపుతూ వివిధ దేశాల చిత్రపటాలు తన చర్మంపైనే గీయించింది. రకరకాల బొమ్మలను కూడా గీయించి వాటిని ఎప్పటికప్పుడు పోస్ట్ చేసింది. నెటిజన్ల నుంచి అమె ఫోటోలకు భారీగా స్పందన వచ్చింది. ఆమె ఫాలోయర్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఓ సెలబ్రిటీగా మారిపోయింది.
